నేడూ వడ్డనే... మళ్లీ పెరిగిన పెట్రోలు ధర!

  • పెట్రోలుపై 15 పైసల మేరకు పెరిగిన ధర
  • డీజిల్ పై 20 పైసల ధర పెంపు
  • హైదరాబాద్ లో రూ. 89 దాటిన పెట్రోలు ధర
'పెట్రో' ఉత్పత్తుల ధరలు ఈ రోజు మరింతగా పెరిగాయి. ఈ ఉదయం లీటరు పెట్రోలుపై 15 పైసలు, డీజిల్ పై 20 పైసల మేరకు ధరను పెంచుతున్నట్టు ప్రభుత్వరంగ చమురు కంపెనీలు ప్రకటించాయి. దీంతో న్యూఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు రూ. 84కు చేరగా, లీజిల్ ధర రూ. 75.45కు పెరిగింది.

ముంబైలో పెట్రోలు ధర రూ. 91.34కు, డీజిల్ ధర రూ. 80.10కి చేరగా, హైదరాబాద్ లో పెట్రోలు రూ. 89.06, డీజిల్ రూ. 82.07కు పెరిగాయి. విజయవాడలో పెట్రోలు రూ. 88.25, డీజిల్ రూ. 80.92కు, గుంటూరులో పెట్రోలు 88.45, డీజిల్ రూ. 81.12కు పెరిగాయి.
Go Back to Shorts
Petrol
Diesel
Price Hike
OMCs

More Telugu News