చంద్రబాబుతో పొత్తు కలుస్తారా? థూ..మీ బతుకులు చెడ!: ‘కాంగ్రెస్’పై కేసీఆర్ మండిపాటు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చంద్రబాబుతో పొత్తు కలుస్తారా? థూ..మీ బతుకులు చెడ!: ‘కాంగ్రెస్’పై కేసీఆర్ మండిపాటు

  • చంద్రబాబుతో మీకు పొత్తా?
  • అడుక్కుంటే నేను ఇస్తాను.. నాలుగు సీట్లు
  • మళ్లీ ఆంధ్రోళ్లకు అప్పగిస్తారా అధికారం?
‘చంద్రబాబుతో పొత్తు కలుస్తారా? థూ..మీ బతుకులు చెడ’ అని కాంగ్రెస్ పార్టీపై సీఎం కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ లో జరుగుతున్న ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ, ‘ఇవొక బతుకులా! ఎవడైతే తెలంగాణను నాశనం చేశాడో, గుండు కొట్టిండో.. చంద్రబాబుతో పొత్తా? మీ బతుకులకు. అడుక్కుంటే నేను ఇస్తాను.. నాలుగు సీట్లు. ఇదా మీ బతుకు!

దయచేసి, తెలంగాణ మేధావులకు, పెద్దలకు నేను మనవి చేస్తున్నా.. మళ్లీ ఆంధ్రోళ్లకు అప్పగిస్తారా అధికారం? తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకెట్టు పెడతారా? కాంగ్రెస్ పార్టీ వాళ్లు పరాన్నభుక్కులు.. వీళ్ల చేతుల్లో ఏమీ ఉండదు’ అని కేసీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ నాయకులు చెబుతున్న సొల్లు పురాణాలు, పిచ్చికూతలు టీ-కాంగ్రెస్ నేతలు కూస్తున్నారని మండిపడ్డారు.
Chandrababu
Congress
kcr

More Telugu News