సిద్ధిపేటలో రచ్చరచ్చ.. వీధికెక్కి కొట్టుకున్న టీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు!
- ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే సతీశ్ కుమార్
- అడ్డుకున్న గోవర్ధనగిరి గ్రామస్తులు, కాంగ్రెస్ నేతలు
- పరస్పర దాడిలో పలువురికి గాయాలు
జై తెలంగాణ అంటూ నినాదాలు ఇస్తూ కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తలు పార్టీ జెండా కర్రలతో పరస్పరం దాడి చేసుకున్నారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను సముదాయించేందుకు యత్నించినా ఫలితం లేకపోయింది. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిని అధికారులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.