Andhra Pradesh: పవన్ కల్యాణ్... నిన్నెవరు నమ్మేది?: మంత్రి జవహర్ మండిపాటు

జనసేన పార్టీని స్థాపించి, తెలుగుదేశం పార్టీపైనా, చంద్రబాబుపైనా విమర్శలు చేయడమే లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్న పవన్ కల్యాణ్ ను ప్రజలెవరూ నమ్మే పరిస్థితి లేదని ఆంధ్రప్రదేశ్ మంత్రి జవహర్ మండిపడ్డారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రజా సమస్యలపై పవన్ కు ఏ మాత్రం అవగాహన లేదని వ్యాఖ్యానించారు. జగన్ ను కాపాడేందుకు బీజేపీతో లోపాయకారీ ఒప్పందం చేసుకున్న ఆయన, అనునిత్యమూ రాష్ట్రాభివృద్ధిని కాంక్షించే చంద్రబాబును టార్గెట్ చేసుకున్నారని విమర్శించారు. నియోజకవర్గానికి రూ. 25 కోట్లను ఖర్చుపెట్టి ఎన్నికల్లో గెలవాలని టీడీపీ ప్రయత్నిస్తోందని పవన్ చేసిన వ్యాఖ్యలు, ఆయన అవగాహనా లేమికి నిదర్శనమని జవహర్ అభిప్రాయపడ్డారు.
Andhra Pradesh
Pawan Kalyan
Jawahar
Chandrababu
BJP
Jagan

More Telugu News