ప్రమాద సమయంలో 140 కి.మీ. స్పీడ్ తో వెళుతున్న 'గీతం' మూర్తి కారు!
- ఎదురుగా వస్తున్న ఫోర్డ్ ట్రక్ ను ఢీకొన్న మూర్తి కారు
- ఘోర ప్రమాదంలో అక్కడికక్కడే దుర్మరణం
- తీవ్రంగా గాయపడిన కడియాల వెంకటరత్నం పరిస్థితి విషమం
ప్రమాదం జరిగిన సమయంలో మూర్తి బృందం ప్రయాణిస్తున్న కారు గంటకు 140 కిలోమీటర్లకు పైగా వేగంతో వెళుతున్నట్టు తెలుస్తోంది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రమాదం జరుగగా, అక్కడికక్కడే ఇద్దరు, ఆసుపత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు మరణించారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన ఐదో వ్యక్తి కడియాల వెంకట రత్నాన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.