తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ ప్రాజెక్టు.. స్టెంట్ ల తయారీ యూనిట్
- మంత్రి కేటీఆర్ ను కలిసిన ఎస్ఎంటీ కంపెనీ బృందం
- రూ.250 కోట్లతో ఏర్పాటు కానున్న ప్లాంట్
- ఈ ప్లాంట్ ద్వారా 2 వేల మందికి ఉద్యోగాలు: కేటీఆర్
తెలంగాణ ప్రభుత్వ విధానాలు, అత్యుత్తమ మౌలిక వసతుల వల్లే ఇక్కడ ప్లాంట్ ఏర్పాటు చేయాలనుకున్నామని ఎస్ఎంటీ ప్రతినిధులు చెప్పారు. కాగా, తెలంగాణకు ప్రతిష్టాత్మక ప్లాంట్ రావడంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. రాష్ట్రానికి ఈ ప్లాంట్ రావడం ద్వారా కొత్తగా రెండు వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయని అన్నారు.