'బిగ్ బాస్ 2' షో వలన అప్పటివరకూ చూడని ప్రపంచాన్ని చూశాను: నాని
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'బిగ్ బాస్ 2' షో వలన అప్పటివరకూ చూడని ప్రపంచాన్ని చూశాను: నాని

  • ఒక వైపున 'బిగ్ బాస్ 2' షూటింగ్ 
  • మరో వైపున 'దేవదాస్' షూటింగు 
  • మానసిక ఒత్తిడిని అనుభవించాను
చిన్న సినిమాలతో .. చిన్నహీరోగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన నాని, ఆ తరువాత వరుస విజయాలతో స్టార్ డమ్ ను సొంతం చేసుకున్నాడు. ఈ క్రేజ్ కారణంగానే ఆయనకి 'బిగ్ బాస్ 2' షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించే అవకాశం లభించింది. రీసెంట్ గా ఈ రియాలిటీ షో ముగిసింది. ఈ సందర్భంగా నాని ఓ ఆంగ్ల దినపత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భావాలను పంచుకున్నాడు.

'బిగ్ బాస్ 2'షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించడానికి ముందు నేను ఓ చిన్న ప్రపంచంలో సంతోషంగా ఉంటూ వచ్చాను. ఈ ప్రపంచం ఇలాగే ఉంటుందని అనుకున్నాను. కానీ ఈ చిన్న ప్రపంచంలో ఎన్ని రకాల మనుషులు ఉంటారనేది ఈ షో నాకు తెలిసేలా చేసింది. నిజమైన ప్రపంచం ఎలా ఉంటుందనేది నాకు తెలియజెప్పింది.

ప్రపంచంలో అందరినీ మనం మెప్పించలేమనీ .. మనల్ని ఇష్టపడని వాళ్లు కూడా వుంటారనీ .. అలాంటి వాళ్లను మనం ఏమీ చేయలేమనే విషయం కూడా నాకు అర్థమైంది. ఒక వైపున 'బిగ్ బాస్ 2'షోకి నేను అనుకున్న దానికంటే ఎక్కువ సమయాన్ని కేటాయించవలసి వచ్చింది. మరో వైపున 'దేవదాస్' షూటింగ్ కారణంగా చాలా మానసిక ఒత్తిడిని అనుభవించాను" అని చెప్పుకొచ్చాడు.    
nani

More Telugu News