ముద్దు సీన్లకు నో .. కొత్త షరతు పెడుతున్న టైగర్ ష్రాఫ్!
- ప్రియురాలి కోసమేనన్న సన్నిహితులు
- టైగర్ ముద్దు సీన్లు చేయడం దిషాకు ఇష్టం లేదట
- బాలీవుడ్ కు మరో సల్మాన్ దొరికినట్టే
టైగర్ హాట్ సీన్లలో నటించటం ఆయన ప్రియురాలు దిషా పటానీకి ఇష్టం లేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాడని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. తన ప్రియుడు సహచర తారలతో తెరపై శృంగార సన్నివేశాల్లో పాల్గొనకూడదని.. మామూలు ఇతర అమ్మాయిల్లానే దిషా కూడా భావిస్తోందని, బంధాలకు ఎంతో విలువ ఇచ్చే టైగర్ ష్రాఫ్ తన ప్రియురాలిని గౌరవించే ఉద్దేశంతోనే ముద్దులకు నో చెబుతున్నాడని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
ఇక టైగర్ తన తండ్రి జాకీ ష్రాఫ్ లా కాకుండా ఫిట్ నెస్ నుంచి సినిమాల వరకు ఎంతో శ్రద్ధ కనుబరుస్తున్నాడు. చేసింది ఐదు సినిమాలే అయినా తన వ్యక్తిగత జీవితం, కెరీర్ పై టైగర్ కు పూర్తి అవగాహన ఉందని బాలీవుడ్ జనాలు మెచ్చుకుంటున్నారు. ఇక ముద్దు సీన్లకు నో చెప్పాలని టైగర్ తీసుకున్న నిర్ణయంతో బాలీవుడ్ కు మరో సల్మాన్ ఖాన్ దొరికాడని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎందుకంటే, ముద్దు సీన్లు భారతీయ సంస్కృతికి వ్యతిరేకం కాబట్టి సల్మాన్ అలాంటి సీన్లకు దూరంగా వుంటాడు!