హీరోగా కౌశల్ .. కౌశల్ ఆర్మీ సభ్యులే నిర్మాతలు?
- 'బిగ్ బాస్ 2' విన్నర్ గా కౌశల్
- అందరిలోను పెరిగిన క్రేజ్
- హీరోగా ఎంట్రీకి సన్నాహాలు
రీసెంట్ గా 'బిగ్ బాస్ 2'లో కౌశల్ ను గెలిపించిన కౌశల్ ఆర్మీ .. ఆయన కోసం నిర్మాతలుగా మారుతున్నారు. అంతా కలిసి 4 కోట్ల రూపాయలను పోగేసి ఒక సినిమా చేయనున్నట్టు తెలుస్తోంది. గతంలో సినిమాల్లోను .. సీరియల్స్ లోను .. యాడ్స్ లోను నటించిన అనుభవం కౌశల్ కి వుంది. ఆయన సోలో హీరోగా రూపొందనున్న ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.