బిగ్ బ్రేక్ వచ్చింది .. ఇక నా తడాఖా చూపిస్తా: కౌశల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బిగ్ బ్రేక్ వచ్చింది .. ఇక నా తడాఖా చూపిస్తా: కౌశల్

  • 'బిగ్ బాస్ హౌస్ 'లోకి వెళ్లాను 
  • మీ మనసులు గెలుచుకున్నాను 
  • మీ సహకారంతో ముందుకెళతాను    
'బిగ్ బాస్ 2' హౌస్ లో మొదటి నుంచి కూడా తన ప్రత్యేకతను చాటుకుంటూ వచ్చిన కౌశల్, ఎంతోమంది అభిమానుల మనసులను దోచుకుని టైటిల్ ను గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన చాలా ఉత్సాహంగా మాట్లాడాడు. "నేను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లింది .. అక్కడ గట్టి పోటీని ఎదుర్కొన్నది మీ అభిమానాన్ని సంపాదించుకోవడం కోసమే. ఇప్పుడు చెప్పండి మీ కోసం నేనేం చేయాలో" అన్నాడు.

దాంతో ఫ్యాన్స్ అంతా కూడా 'సినిమాల్లో హీరో కావాలంటూ' నినాదాలు చేశారు. అందుకు కౌశల్ స్పందిస్తూ .. "అయితే తప్పకుండా మీ కోరిక నెరవేరుస్తాను. ఇక నుంచి దర్శకుల కోసం వెయిట్ చేస్తుంటాను. నేను హీరోగా సినిమా చేస్తానంటూ ఏ దర్శకుడైనా వస్తే .. నా తడాఖా చూపిస్తాను. ఇంతకాలానికి 'బిగ్ బాస్ 2' ద్వారా నాకు బిగ్ బ్రేక్ వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, మీ ముచ్చట తీరుస్తాను. మీ అందరి సహకారంతోనే జీవితంలో ఒక్కో అడుగు ముందుకు వెళతాను" అని ఆయన చెప్పుకొచ్చాడు. 
kaushal

More Telugu News