బిగ్ బ్రేక్ వచ్చింది .. ఇక నా తడాఖా చూపిస్తా: కౌశల్
- 'బిగ్ బాస్ హౌస్ 'లోకి వెళ్లాను
- మీ మనసులు గెలుచుకున్నాను
- మీ సహకారంతో ముందుకెళతాను
దాంతో ఫ్యాన్స్ అంతా కూడా 'సినిమాల్లో హీరో కావాలంటూ' నినాదాలు చేశారు. అందుకు కౌశల్ స్పందిస్తూ .. "అయితే తప్పకుండా మీ కోరిక నెరవేరుస్తాను. ఇక నుంచి దర్శకుల కోసం వెయిట్ చేస్తుంటాను. నేను హీరోగా సినిమా చేస్తానంటూ ఏ దర్శకుడైనా వస్తే .. నా తడాఖా చూపిస్తాను. ఇంతకాలానికి 'బిగ్ బాస్ 2' ద్వారా నాకు బిగ్ బ్రేక్ వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, మీ ముచ్చట తీరుస్తాను. మీ అందరి సహకారంతోనే జీవితంలో ఒక్కో అడుగు ముందుకు వెళతాను" అని ఆయన చెప్పుకొచ్చాడు.