స్మార్ట్ గా దొంగతనం చేసిన కి'లేడీ'... వీడియో చూసి వేట ప్రారంభించిన పోలీసులు!
- ముంబైలోని ములుంద్ లో ఘటన
- సెల్ ఫోన్ కస్టమర్లలా షాపులోకి ప్రవేశించిన ఇద్దరమ్మాయిలు
- నటిస్తూ, ఫోన్ కొట్టేసిన యువతి
ఇద్దరు యువతులు షాప్ లోకి వచ్చారు. వారిలో ఒకరు సెల్ ఫోన్ కొనుగోలు చేస్తున్నట్టుగా నటిస్తుండగా, మరో యువతి అటూ ఇటూ చూస్తూ, పక్కనే ఉన్న ఓ ఫోన్ ను చేతిలోకి తీసుకుని తన హ్యాండ్ బ్యాగులో వేసుకుంది. ఆపై ఫోన్ నచ్చలేదన్నట్టు చెబుతూ, వారిద్దరూ బయటకు జారుకున్నారు. ఆ తరువాత ఫోన్ పోయిన విషయాన్ని గుర్తించిన దుకాణం యజమాని పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదైంది.