నేడు కూడా పైకే... 'పెట్రో' ఉత్పత్తుల తాజా ధరలు!

  • 24 పైసలు పెరిగిన పెట్రోలు ధర
  • డీజిల్ పై 30 పైసల వడ్డన
  • హైదరాబాద్ లో రూ. 88.77కు లీటరు పెట్రోలు
పెట్రోలు, డీజిల్ ధరలు సోమవారం కూడా పెరిగాయి. లీటరు పెట్రోలుపై 24 పైసలు, డీజిల్ పై 30 పైసల మేరకు ధరను పెంచుతున్నట్టు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ఈ ఉదయం ప్రకటించాయి. దీంతో ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు రూ. 83.73, డీజిల్ ధర రూ. 75.09కి పెరిగాయి. ముంబైలో పెట్రోలు ధర తొలిసారిగా రూ. 91ని దాటింది. నేడు ముంబైలో పెట్రోలు ధర రూ. 91.08గా, డీజిల్ ధర రూ. 79.72గా ఉంది. హైదరాబాద్ లో లీటరు పెట్రోలు ధర రూ. 88.77కి పెరుగగా, డీజిల్ లీటరుకు రూ. 81.68కు చేరుకుంది. పెట్రోలు ధరలు ఈ స్థాయికి పెరగడం చరిత్రలో ఇదే ప్రథమం.
Go Back to Shorts
Petrol
Diesel
Price Hike

More Telugu News