మావోయిస్టులారా.. నన్నెందుకు చంపారో చెప్పండి?: సివేరి సోమ ‘ఆత్మఘోష’ పోస్టర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మావోయిస్టులారా.. నన్నెందుకు చంపారో చెప్పండి?: సివేరి సోమ ‘ఆత్మఘోష’ పోస్టర్

  • నేనేం తప్పు చేశాను? 
  • తప్పుచేసుంటే ఒక వార్నింగ్ అయినా ఇచ్చారా?
  • ‘జవాబు చెప్పండి’ పేరిట సివేరి ‘ఆత్మఘోష’ కరపత్రం
టీడీపీ మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మావోయిస్టులు ఇటీవల కాల్చి చంపారు. ఈ ఘటనను రాజకీయ నాయకులు, గిరిజన సంఘాలు, సోమ అనుచరులు తీవ్రంగా ఖండించారు. అయితే, మావోయిస్టులు కాల్చి చంపిన సివేరి సోమ ఆత్మఘోషిస్తోందంటూ ‘జవాబు చెప్పండి’ పేరిట ఓ కరపత్రం సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తోంది.

‘నేనొక మాజీ ఎమ్మెల్యేని. నాకు ఆరుగురు పిల్లలు. ఎదిగొచ్చిన కొడుకులకు ఉద్యోగం కూడా లేదు. సొంత ఇల్లు కూడా లేదు. అద్దె ఇంట్లో ఉంటున్నాను. నేనేం తప్పు చేశాను? ఏదైనా తప్పుచేసుంటే ఒక వార్నింగ్ అయినా ఇచ్చారా? లేదు. నన్నెందుకు చంపారు? నేను ఏ వర్గానికి శత్రువుని? మావోయిస్టులారా చెప్పండి, కుహనా హక్కుల సంఘల్లారా..మీరైనా చెప్పండి- సివేరి సోమ’ అని ఆ కరపత్రంలో పేర్కొన్నారు. ఈ కరప్రతంలో సోమ భౌతికకాయం ఫొటోతో పాటు, ఆయన పాస్ పోర్ట్ చిత్రం కూడా కనబడుతుంది.
siveri soma
poster

More Telugu News