కేసీఆర్ నాకు అన్నేమీ కాదు: విజయశాంతి
- కేసీఆరే నన్ను దేవుడిచ్చిన చెల్లెలని చెప్పారు
- నేను ఎన్నడూ ఆ మాట అనలేదు
- కాంగ్రెస్ నేతలపై కేసులతో టీఆర్ఎస్ కే నష్టం
- కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి
కాంగ్రెస్ నేతలపై పెడుతున్న కేసులతో టీఆర్ఎస్ పార్టీకే నష్టమని, ఈ విషయాన్ని ఆ పార్టీ వారే తనకు ఫోన్ చేసి చెబుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ను తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రచారం చేయనున్నానని, ఆ విజయాన్ని సోనియాగాంధీకి కానుకగా ఇస్తామన్న నమ్మకం ఉందని అన్నారు. తాను అసెంబ్లీకి పోటీ చేయాలని భావించడం లేదని, ప్రస్తుతానికి ప్రచారానికే పరిమితమయ్యే తాను, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ విషయమై తరువాత ఆలోచిస్తానని అన్నారు.