కోడీ, కోడీ పోట్లాడుతుంటే, విడదీసేందుకు శునకం విఫలయత్నం... నవ్వులు పూయిస్తున్న వైరల్!

  • వైరల్ అవుతున్న వీడియో
  • పందెం వేసుకున్నట్టు పోట్లాడుతున్న కోళ్లు
  • విడదీసేందుకు ప్రయత్నించిన కుక్క
సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తూ, వైరల్ అవుతున్న వీడియో ఇది. రెండు కోళ్లు పందెం వేసుకున్నట్టు పోట్లాడుకుంటుంటే, ఒక కుక్క వాటిని విడదీసేందుకు విఫలయత్నం చేస్తోంది. కోళ్లు మాత్రం కుక్కను ఏ మాత్రం పట్టించుకోకుండా తమ పోరాటాన్ని సాగిస్తూనే ఉన్నాయి. తన నోటితో ఓ కోడి తోకను కరుచుకుని వెనక్కు లాక్కెళ్లినా అవి ఆగలేదు. వాటి పోరాటాన్ని ఆపే ప్రయత్నంలో, సదరు శునకం ఏం చేసినా, అవి మాత్రం తమ పౌరుషాన్ని చూపుతూనే ఉన్నాయి.

సామాజిక మాధ్యమాల్లో ఐబీసీ తమిళ్ పేరిట ఇది విడుదల కాగా, చూసిన వారంతా నవ్వుకుంటున్నారు. తమిళనాడులోని కోయంబత్తూరులో ఇది జరిగినట్టు సమాచారం. మురళీ‌ధర్ అనే జంతు ప్రేమికుడు కోళ్లు, పిల్లులు, కుక్కలను పెంచుతుండగా, ఆయన అధీనంలోని రెండు కోళ్లు కొట్లాడుతుంటే, ఓ కుక్క వాటిని విడదీసేందుకు ప్రయత్నిస్తోంది. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.
Go Back to Shorts
Tamilnadu
Cock
Fight
Dog

More Telugu News