చైతూ .. సమంతల మూవీ ఆల్రెడీ మొదలైపోయిందట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చైతూ .. సమంతల మూవీ ఆల్రెడీ మొదలైపోయిందట!

  • శివ నిర్వాణ దర్శకత్వంలో 'మజిలీ'
  • చైతూ సరసన నాయికగా సమంత 
  • అక్టోబర్ 3వ వారం నుంచి షూటింగుకి  
సమంత .. చైతూ పెళ్లి తరువాత వీళ్లిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా వస్తే చూడాలని అభిమానులు ముచ్చటపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్లిద్దరికి తగిన కథను 'శివ నిర్వాణ' సిద్ధం చేసి ఒప్పించాడు. ఇంతకుముందు 'నిన్నుకోరి' సినిమాతో యూత్ ను ఒక రేంజ్ లో ఆకట్టుకున్న ఆయన, సమంత .. చైతూలకి సెట్ అయ్యే ఒక కథ చెప్పి ఓకే అనిపించుకున్నాడు. ఈ సినిమాకి 'మజిలీ' అనే టైటిల్ ను కూడా ఖరారు చేసుకున్నాడు. ప్రస్తుతం సమంత .. చైతూ స్పెయిన్ లో వున్నారు. అక్కడి నుంచి వచ్చాక షూటింగ్ మొదలవుతుందని అనుకున్నారు. కానీ శివ నిర్వాణ ఆల్రెడీ ఫస్టు షెడ్యూలును ఆరంభించాడని సమాచారం. టైమ్ సేవ్ అవుతుందనే ఉద్దేశంతో సమంత .. చైతూ కాంబినేషన్ సీన్స్ కాకుండా వేరే ఆర్టిస్టులతో చకచకా షూటింగు కానిచ్చేస్తున్నాడట. వచ్చేనెల 3వ వారంలో సమంత - చైతూ ఈ సినిమా షూటింగులో జాయిన్ అవుతారని అంటున్నారు.   
samanta
chaithu

More Telugu News