ఎమ్మెల్యే కిడారి హత్య ఎఫెక్ట్.. అరకు సీఐపై వేటు?
- అరకు సీఐ వెంకునాయుడిపై సస్పెన్షన్ వేటు
- నేడు ఉత్తర్వులు వెలువడే అవకాశం
- మరికొందరు అధికారుల బదిలీ
ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హత్య అనంతరం ఆగ్రహంతో ఊగిపోయిన గిరిజనులు అరకు, డుంబ్రిగూడ పోలీస్ స్టేషన్లపై దాడికి పాల్పడి నిప్పు పెట్టారు. పోలీసులను చితక్కొట్టారు. సామగ్రిని ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే డుంబ్రిగూడ ఎస్సై అమ్మన్రావును సస్పెండ్ చేసిన అధికారులు నేడు వెంకునాయుడును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు తెలుస్తోంది. అలాగే, మరికొందరు అధికారులను కూడా బదిలీ చేయాలని నిర్ణయించినట్టు సమాచారం.