రేవంత్ ఇంట్లో కోటిన్నర నగదు, బంగారం స్వాధీనం... ఈడీ అదుపులో సోదరుడి భార్య!
- డబ్బు ఎక్కడిదో చెప్పాలని రేవంత్ ను అడిగిన ఈడీ
- సరైన సమాధానం ఇవ్వకపోవడంతో స్వాధీనం
- బ్యాంకు లాకర్లను తెరిపించేందుకు కొండల్ రెడ్డి భార్యను తీసుకెళ్లిన అధికారులు
దీంతో వాటిని ప్రస్తుతం స్వాధీనం చేసుకుంటున్నామని అధికారులు వెల్లడించినట్టు తెలిసింది. మరోవైపు రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి మాదాపూర్ లో నివాసం ఉంటుండగా, ఆయన ఇంట్లోనూ నిన్నటి నుంచి తనిఖీలు జరుగగా, ఈ తెల్లవారుజామున 5 గంటలకు సోదాలు ముగించామని అధికారులు ప్రకటించారు. కొండల్ రెడ్డి భార్యను అదుపులోకి తీసుకున్న అధికారులు, బ్యాంకు లాకర్లను తెరిచేందుకు తీసుకెళ్లారు. ఆ లాకర్లలో కొన్ని ముఖ్యమైన దస్త్రాలు ఉండివుండవచ్చని ఈడీ భావిస్తోంది.