ప్రేమ కాదు ఉన్మాదం.. ప్రియురాలి తలను తెచ్చి, పోలీసులకు లొంగిపోయిన యువకుడు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రేమ కాదు ఉన్మాదం.. ప్రియురాలి తలను తెచ్చి, పోలీసులకు లొంగిపోయిన యువకుడు!

  • కర్ణాటకలోని కంచర్లపల్లిలో ఘటన
  • యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్న యువకుడు
  • అనుమానంతో గొంతు కోసి దారుణహత్య
ప్రేమలో రేగిన అనుమానం పెనుభూతంగా మారింది. తనతో పాటు మరో వ్యక్తితో ప్రియురాలు చనువుగా ఉంటోందన్న కోపంతో ఓ యువకుడు ఉన్మాదిగా మారిపోయాడు. ఆమె గొంతును కోసి కిరాతకంగా హత్యచేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటన కర్ణాటకలోని కంచర్లపల్లిలో చోటుచేసుకుంది.

ఇక్కడి శ్రీనివాసపురం పట్టణం గఫార్‌ఖాన్‌ వీధికి చెందిన అజీజ్‌ (27) మొబైల్‌ షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇప్పటికే పెళ్లి చేసుకున్న అజీజ్ స్థానికంగా ఉంటున్న రోహన్ అనే యువతితో సన్నిహితంగా మెలిగేవాడు. దీంతో వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే తనతోనే కాకుండా మరొకరితో కూడా ఆమె చనువుగా ఉంటోందని అజీజ్ అనుమానం పెంచుకున్నాడు. దాంతో ఆమెను చంపేయాలని నిర్ణయం తీసుకున్నాడు.

ఈ నేపథ్యంలో చింతామణి తాలుకాలోని మురగమల్లా దర్గాలో పూజలు చేద్దామని నమ్మబలికి తీసుకెళ్లాడు. దర్శనం అనంతరం ఊరి శివార్లలోని మామిడితోపు షెడ్ వద్దకు తీసుకెళ్లి వేటకొడవలితో ఆమె గొంతు కోసి, తలను మొండెం నుంచి వేరు చేశాడు. ఆ తర్వాత ఆమె తలను తీసుకుని శ్రీనివాసపురం పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
love
murder
Karnataka
Police

More Telugu News