హైదరాబాద్ స్కూల్ లో 'గుడ్ టచ్-బ్యాడ్ టచ్'పై బాలికలకు అవగాహన... కుమార్తెపై తండ్రి అత్యాచారాన్ని బయటపెట్టింది!
- ఐదో తరగతి చదువుతున్న బాలిక
- ఏడాదిగా తండ్రి అత్యాచారం
- నాలుగేళ్ల చిన్న బిడ్డనూ వదలని కామాంధుడు
ఆ వెంటనే కదిలిన చైల్డ్ వెల్ఫేర్ బృందం, ఆమె తండ్రిపై ఫిర్యాదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. ఈ దుర్మార్గుడైన తండ్రి, తన నాలుగేళ్ల చిన్న కుమార్తెపైనా ఆత్యాచారానికి ప్రయత్నించాడని స్వచ్ఛంద సంస్థ సభ్యులు గుర్తించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అతనికి 12 ఏళ్ల క్రితం వివాహమైందని, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉండగా, ప్రస్తుతం భార్య మానసిక పరిస్థితి బాగాలేదని అధికారులు తెలిపారు.