సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • బయోపిక్ లలో నటిస్తానంటున్న ముద్దుగుమ్మ 
  • తండ్రి షూటింగు లొకేషన్ కి వెళ్లిన రామ్ చరణ్
  • రైఫిల్ షూటింగులో శిక్షణ తీసుకుంటున్న తాప్సీ  
*  బయోపిక్ లలో నటించడానికి తాను కూడా సిద్ధమేనని అంటోంది అందాలతార పూజా హెగ్డే. 'సానియా మీర్జా, మిథాలి రాజ్ వంటి వాళ్ల జీవితాలు ఇంటరెస్టింగ్ గా వుంటాయి కాబట్టి, వీరి బయోపిక్ లు బాగుంటాయి. ఇలాంటి వాటిలో నటించే అవకాశం వస్తే కనుక అస్సలు వదులుకోను' అని చెప్పింది.
*  జార్జియాలో తన తాజా చిత్రం షూటింగును పూర్తి చేసుకున్న రామ్ చరణ్ అటునుంచి అటు అజర్ బైజాన్ వెళ్లాడు. అక్కడ చిరంజీవి నటిస్తున్న 'సైరా' చిత్రం షూటింగ్ భారీ ఎత్తున జరుగుతుండడంతో నిర్మాతగా పర్యవేక్షించడానికి అక్కడ కొన్ని రోజులు ఉంటాడట.
*  సొట్టబుగ్గల చిన్నది తాప్సీ ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా వుంది. తాజాగా అనురాగ్ కశ్యప్ రూపొందించే 'ఉమానియా' అనే చిత్రంలో నాయికగా నటించనుంది. ఈ చిత్రంలో తాప్సీ షూటర్ గా నటించనుంది. ఇందుకోసం ప్రస్తుతం రైఫిల్ షూటింగులో శిక్షణ తీసుకుంటోందట. 
Pooja
charan
chiranjivi
tapsi

More Telugu News