పర్యాటకంలో రారాజు ఆంధ్రానే.. జాతీయ టూరిజం అవార్డును అందించిన కేంద్రం!
- ప్రదానం చేసిన కేంద్ర మంత్రి అల్ఫోన్స్
- గతేడాది కూడా అవార్డును కొల్లగొట్టిన ఏపీ
- టూరిజం అభివృద్ధిలో విశేష కృషికి అవార్డు
ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఈ రోజు అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. పర్యాటక రంగాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసినందుకు జాతీయ టూరిజం అవార్డు-2018ను ఆంధ్రప్రదేశ్ అందుకుంది. ఇప్పుడే కాదు గతేడాది కూడా జాతీయ పర్యాటక అవార్డును ఏపీనే దక్కించుకోవడం గమనార్హం.