దసరాకి ఫస్టులుక్ తో పలకరించనున్న చరణ్
- విదేశాల్లో చరణ్ మూవీ షూటింగ్
- మరో రెండు రోజుల్లో తిరుగు ప్రయాణం
- సంక్రాంతికి భారీ విడుదల
ఈ సినిమాకి 'స్టేట్ రౌడీ' అనే టైటిల్ పరిశీలనలో వున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కానీ అధికారికంగా మాత్రం ఎలాంటి ఎనౌన్స్ మెంట్ చేయలేదు. విజయదశమి రోజున టైటిల్ తో పాటు ఫస్టులుక్ ను రిలీజ్ చేయాలనే ఆలోచనలో వున్నట్టుగా సమాచారం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.