Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నానా పటేకర్ వేధించాడని చెప్పిన హీరోయిన్ తనుశ్రీ దత్తాపై దాడి!

  • 2008లో నానా పటేకర్ లైంగిక వేధింపులకు గురి చేశాడన్న తనుశ్రీ దత్తా
  • తనుశ్రీ కారుపై దాడి
  • చంపేస్తామని బెదిరించిన ఎంఎన్ఎస్ నేతలు
2008లో ఓ సినిమా షూటింగ్ లో భాగంగా నటుడు నానా పటేకర్ తనను లైంగికంగా వేధించాడని ఆరోపించి సంచలనానికి తెరలేపిన హీరోయిన్ తనుశ్రీ దత్తాపై నిన్న దాడి జరిగింది. నానా పటేకర్ పై ఆరోపణలు చేసిన తరువాత, తనను హత్య చేస్తామని బెదిరింపులు వచ్చాయని, తన కారుపై దాడి జరిగిందని ఆమె ఓ టీవీ చానల్ కు వెల్లడించింది.

కారుపై దాడి జరిగిన సమయంలో తన తల్లిదండ్రులు కూడా అందులో ఉన్నారని తెలిపింది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన నాయకులు తనకు ఫోన్ చేసి బెదిరింపులకు దిగారని, వారు నానా పటేకర్ కు మద్దతుగా నిలిచి, తనను తప్పుపడుతున్నారని ఆరోపించింది. తనకు మద్దతు పలికేందుకు ప్రజలు కూడా ముందుకు రావడం లేదని వాపోయింది.

బాలీవుడ్ పరిశ్రమ కూడా ముందుకు వచ్చి తనకు మద్దతుగా నిలిచే పరిస్థితి లేదని చెప్పింది. జరుగుతున్న ఘటనలపై పోలీసులకు ఫిర్యాదు చేసినంత మాత్రాన తనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదని చెప్పింది.
NanaPatekar
Tanushre Datta

More Telugu News