ఏసీలు, ఫ్రిజ్లు మరింత ప్రియం.. దిగుమతి సుంకాన్ని భారీగా పెంచిన ప్రభుత్వం!
- విదేశాల నుంచి దిగుమతి అయ్యే 19 వస్తువులపై సుంకం పెంపు
- పది శాతం నుంచి 20 శాతానికి పెంచిన ప్రభుత్వం
- బుధవారం అర్ధ రాత్రి నుంచే అమల్లోకి
ఇప్పటి వరకు ఈ 19 వస్తువులు 10 శాతం సుంకం కింద ఉండగా, ఇప్పుడివి 20 శాతానికి చేరాయి. ఈ వస్తువుల దిగుమతుల విలువ దాదాపు రూ.86 వేల కోట్లని ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం దిగుమతి సుంకం పెంచడంతో వాషింగ్ మెషీన్లు, స్పీకర్లు, రేడియల్ కార్ టైర్లు, ఆభరణాలు, కిచెన్, టేబుల్వేర్, ప్లాస్టిక్ వస్తువులు, సూట్కేసుల ధరలు కూడా పెరగనున్నాయి.