మోదీని వెంకన్న ఎప్పటికీ క్షమించడు: కిల్లి కృపారాణి
- ప్రత్యేక హోదా ఇస్తామని తిరుమల వెంకన్న సాక్షిగా చెప్పారు
- మోదీ రాజీనామా చేయాలి
- రాఫెల్ కుంభకోణంపై జేపీసీ వేయాలి
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ, మోదీకి మంచి బుద్ధిని ప్రసాదించాలని స్వామివారిని కోరుకున్నానని చెప్పారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరిగిందని.... తన తొత్తు అనిల్ అంబానీకి రూ. 40 వేల కోట్లకు పైగా లబ్ధిని మోదీ చేకూర్చారని విమర్శించారు. ప్రధాని పదవికి మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాఫెల్ కుంభకోణంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని అన్నారు.