ఇప్పుడే 'దేవదాస్' సినిమా చూశాను .. హిట్ ఖాయం: నాగార్జున
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇప్పుడే 'దేవదాస్' సినిమా చూశాను .. హిట్ ఖాయం: నాగార్జున

  • ప్రమోషన్స్ పూర్తి చేసిన నాగ్ 
  • సక్సెస్ నా పాకెట్లో వుంది 
  • ఆ సంతోషంతో విదేశాలకి వెళుతున్నాను 
'దేవదాస్' సినిమాతో .. ప్రమోషన్స్ తో కొంతకాలంగా నాగార్జున బిజీగా వున్నారు. 'దేవదాస్' సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో ఆయన అమలతో కలిసి సరదాగా విదేశాలకి వెళుతున్నారు. "ఇప్పుడే 'దేవదాస్' సినిమా చూశాను .. విజయం నా పాకెట్ లో వుంది. ఆ ధైర్యంతో .. ఆనందంతోనే హైదరాబాద్ విడిచి ఫ్యామిలీతో వెకేషన్ కి వెళుతున్నాను. ఇక ముందున్నది హాలిడే లైఫే .. థ్యాంక్స్ టూ లెజెండరీ వైజయంతీ మూవీస్ .. అమేజింగ్ నాని .. అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య" అంటూ ట్వీట్ చేశారు.

ఇప్పటికే సమంత .. చైతూ యూరప్ విహారయాత్రలో వున్నారు. అఖిల్ కూడా షూటింగు నిమిత్తం అక్కడే వున్నాడు. వాళ్లతో కలిసి సరదాగా గడపడానికి నాగార్జున - అమల అక్కడికి వెళుతున్నారు. 'కృష్ణార్జున యుద్ధం' పరాజయం తరువాత నాని .. 'ఆఫీసర్' ఫ్లాప్ తరువాత నాగార్జున చేసిన ఈ సినిమా, అభిమానులకు ఎంతవరకూ ఆనందాన్ని కలిగిస్తుందో చూడాలి.
nagarjuna
nani

More Telugu News