'సైనా నెహ్వాల్' బయోపిక్ నుంచి ఫస్టులుక్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'సైనా నెహ్వాల్' బయోపిక్ నుంచి ఫస్టులుక్

  • సైనా నెహ్వాల్ కి యూత్ లో క్రేజ్ 
  • తెరపైకి ఆమె జీవితచరిత్ర 
  • రీసెంట్ గా పట్టాలెక్కిన ప్రాజెక్టు      
బ్యాడ్మింటన్ క్రీడలో సైనా నెహ్వాల్ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఆత్మస్థైర్యంతో ఎన్నో విజయాలను సొంతం చేసుకుంటూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. అలాంటి ఆమె జీవితచరిత్రను అభిమానుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. శ్రద్ధా కపూర్ టైటిల్ రోల్ చేస్తోన్న ఈ సినిమా ఇటీవలే సెట్స్ పైకి వెళ్లింది.

తాజాగా ఈ సినిమా నుంచి శ్రద్ధా కపూర్ ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమా సెట్స్ పైకి రావడానికి ముందే ఫిట్ నెస్ కోసం శ్రద్ధా కపూర్ గట్టిగానే కసరత్తు చేసింది. అందువలన ఫస్టులుక్ లో శ్రద్ధా కపూర్ మంచి ఫిట్ నెస్ తో కనిపిస్తోంది. రీసెంట్ గా శ్రద్ధా కపూర్ చేసిన 'స్త్రీ' భారీ వసూళ్లను సాధిస్తూ .. నటన పరంగా శ్రద్ధా కపూర్ కి మంచి పేరు తెచ్చింది. అలాగే ఈ బయోపిక్ కూడా తనకి మరింత క్రేజ్ ను తీసుకొస్తుందనే నమ్మకంతో ఆమె వుంది.         
shraddha

More Telugu News