కేజ్రీవాల్ తో మానవ అక్రమ రవాణా రాకెట్ నిందితురాలు.. ఫొటో వైరల్!
- జార్ఖండ్ యువతులను అక్రమ రవాణా చేస్తున్న ప్రభా మున్నీ
- 2013 నుంచి పరారీలో ప్రభా
- నిన్ననే అరెస్ట్ చేసిన పోలీసులు
ఎన్జీవో పేరిట ప్లేస్ మెంట్ ఏజెన్సీని నిర్వహించే మున్నీ... జార్ఖండ్ యువతులకు ఉద్యోగాల పేరుతో ఎరవేసి, ఢిల్లీకి పిలిపించి, వారిని అక్రమ రవాణా చేస్తోందని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే జార్ఖండ్ లో ఆమెపై పలు కేసులు ఉన్నాయి. 2013 నుంచి ఆమె పరారీలో ఉంది. ప్రస్తుతం ఆమె రిమాండ్ లో ఉంది. కేసు విచారణలో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.