నేను అలా మాట్లాడటం వలన పెద్ద సినిమాలో ఛాన్స్ పోయింది: హీరో ఆనంద్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేను అలా మాట్లాడటం వలన పెద్ద సినిమాలో ఛాన్స్ పోయింది: హీరో ఆనంద్

  • రామానాయుడు గారు పిలిపించారు 
  • సినిమాలో ఛాన్స్ ఇస్తున్నట్టుగా చెప్పారు 
  • గెస్టు హౌస్ లో ఉండమంటే కుదరదన్నాను
వివిధ భాషల్లో హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్న ఆనంద్ తెలుగులోను కొన్ని సినిమాలు చేశారు. తాజాగా ఆయన 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ, తనకి ఎదురైన ఒక చేదు అనుభవాన్ని గురించి ప్రస్తావించారు. "ఒకసారి రామానాయుడు గారు ఫోన్ చేస్తే ఆఫీసుకి వెళ్లి కలిశాను. నన్ను ఆయన ఆత్మీయంగా పలకరించి, 'నువ్ నా సినిమాలో చేస్తున్నావయ్యా' అన్నారు. అప్పుడు నేను చాలా సంతోష పడ్డాను.

అప్పట్లో నేను ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా 'గోల్కొండ' హోటల్లో ఒక రూమ్ లో ఉండేవాడిని. అయితే రామానాయుడుగారి సినిమా చేసేవాళ్లు ఆయన గెస్టుహౌస్ లోనే ఉండాలి అని చెప్పారు. అందుకు నేను ఒప్పుకోలేదు .. 'గోల్కొండ' హోటల్లో నేను ఎప్పుడూ వుండే రూమ్ లోనే వుంటాను .. అవసరమైతే ఆ డబ్బులు నేనే ఇచ్చుకుంటాను' అన్నాను. ఆ తరువాత ఆ ప్రొడక్షన్ నుంచి నాకు కాల్ రాలేదు. అలా తెలిసీ తెలియక మాట్లాడి ఒక మంచి బ్యానర్లో పెద్ద సినిమాలో చేసే ఛాన్స్ పోగొట్టుకున్నాను. అందుకు ఇప్పటికీ ఫీల్ అవుతుంటాను" అని చెప్పుకొచ్చారు. 
aanand
ali

More Telugu News