‘చంద్రోదయం’ ఫస్ట్‌లుక్ విడుదల
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘చంద్రోదయం’ ఫస్ట్‌లుక్ విడుదల

  • చంద్రబాబు పాత్రలో వినోద్ నువ్వుల 
  • చివరి దశలో చిత్రం చిత్రీకరణ 
  • దేశ చరిత్రలో చంద్రబాబు అరుదైన నాయకుడు: దర్శకుడు వెంకటరమణ
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు జీవితంలోని కీలక ఘట్టాల ఆధారంగా తెరకెక్కనున్న బయోపిక్ ‘చంద్రోదయం’. పి.వెంకటరమణ దర్శకత్వంలో జీజే రాజేంద్ర నిర్మిస్తున్న ఈ బయోపిక్  ఫస్ట్ లుక్ ను చిత్రయూనిట్ ఈరోజు విడుదల చేసింది.  

చంద్రబాబు ఓ లివింగ్ లెజెండ్  


చంద్రబాబునాయుడు ఓ లివింగ్ లెజెండ్ అని, దేశ చరిత్రలో ఆయనొక అరుదైన, ఆదర్శవంతమైన నాయకుడని దర్శకుడు వెంకటరమణ ప్రశంసించారు. ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సామాన్య కుటుంబంలో జన్మించి అగ్రస్థానానికి ఎదిగిన చంద్రబాబు జీవితం గురించి అందరికీ తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే ‘చంద్రోదయం’ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, ఈ చిత్రం చిత్రీకరణ చివరిదశలో ఉందని, వినోద్ నువ్వుల చంద్రబాబు పాత్రలో నటిస్తున్నాడని చెప్పారు.
మహానాయకుడి బయోపిక్ ను ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నాం

చంద్రబాబు వంటి మహానాయకుడి బయోపిక్ ను తాము ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నామని, వచ్చే నెలలో పాటలను, ఆ తర్వాత ఈ సినిమాను విడుదల చేస్తామని  నిర్మాత జీజే రాజేంద్ర తెలిపారు. నారావారిపల్లె, తిరుపతి, హైదరాబాద్, అమరావతి, సింగపూర్ తదితర లొకేషన్స్ లో ఈ చిత్రాన్ని చిత్రీకరించామని, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. చంద్రబాబునాయుడు పాత్రలో నటిస్తున్న వినోద్ నువ్వుల లుక్ ను విడుదల చేశామని అన్నారు.
Chandrababu
chandrodayam

More Telugu News