మూడు వేల కిలోమీటర్ల మైలు రాయిని చేరుకున్న వైఎస్ జగన్!

  • కొత్తవలస వద్ద ఈ మైలురాయిని చేరిన జగన్
  • పైలాన్ ను ఆవిష్కరించి..మొక్క నాటిన వైనం
  • కేక్ కట్ చేసిన జగన్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ తన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా నేడు 3 వేల కిలోమీటర్ల మైలురాయిని అధిగమించారు. విజయనగరం జిల్లాలోని కొత్తవలస వద్దకు చేరగానే తన యాత్రలో ఆయన మూడు వేల కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్నారు. ఈ సందర్భంగా 'ప్రజాసంకల్పయాత్ర 3000 కి.మీ.' పైలాన్ ని జగన్ ఆవిష్కరించి, ఓ మొక్కను నాటారు. అనంతరం, వైసీపీ కార్యకర్తలు, అభిమానులు తీసుకొచ్చిన కేక్ ను కట్ చేసిన జగన్, తన యాత్రను కొనసాగించారు. కాగా, గత ఏడాది నవంబర్ 6న ఇడుపులపాయలో జగన్ ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైంది.

Go Back to Shorts
ys jagan
vijayanagaram

More Telugu News