'ఎట్టకేలకు సెలవులు'... అంటూ విహారయాత్రకు వెళ్లిపోయిన సమంత!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ఎట్టకేలకు సెలవులు'... అంటూ విహారయాత్రకు వెళ్లిపోయిన సమంత!

  • ఈ సంవత్సరం సమంత సినిమాలన్నీ హిట్
  • తరువాతి చిత్రం భర్త నాగచైతన్యతోనే
  • కాస్తంత బ్రేక్ కోసం విహారయాత్రకు వెళ్లిన సమంత
అక్కినేని వారింటి కోడలిగా కొత్త అవతారం ఎత్తిన హీరోయిన్ సమంతకు ఈ సంవత్సరం ఎంత ప్రత్యేకమో చెప్పక్కర్లేదు. ఆమె నటించిన 'రంగస్థలం', 'మహానటి', 'యూటర్న్', 'ఇరుంబుదురై' (తెలుగులో అభిమన్యుడు) చిత్రాలు బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లను రాబట్టిన సంగతి తెలిసిందే. తన తరువాతి చిత్రాన్ని భర్త నాగ చైతన్యతో కలసి చేయనున్న సమంత, ఈలోగా చిన్న బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకుని, అనుకున్నదే తడవుగా విహారయాత్రకు వెళ్లిపోయింది.

ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా ఫ్యాన్స్ తో పంచుకున్న ఆమె, 'ఫైనల్లీ వెకేషన్' అంటూ వ్యాఖ్యానించింది. అక్టోబర్ 6న సమంత, చైతూల వివాహ దినోత్సవం కాగా, అదే రోజున వీరి కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఆ సమయానికి సమంత తన టూర్ ను ముగించుకుని తిరిగి వస్తుందని తెలుస్తోంది.
Samanta
Vacation
Naga Chaitanya

More Telugu News