'మమ్మల్ని చంపేస్తారేమో' అంటూ పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట!
- ప్రేమ వివాహం చేసుకున్న జంట
- కులాలు వేరు కావడంతో పెద్దల బెదిరింపులు
- కౌన్సెలింగ్ చేసి పంపిన పోలీసులు
అపై శనివారం నాడు వధూవరులు స్వస్థలానికి రాగా, ఇరువురి తల్లిదండ్రులు వారిని బెదిరించి, వేరుచేయాలని చూడటంతో తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరుతూ పోలీసులను అశ్రయించారు. ఈ మేరకు, పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోని లా అండ్ ఆర్డర్ డీసీపీ ఫకీరప్పను కలిసి వినతిపత్రం అందించారు. వారిద్దరికీ అభయమిచ్చిన ఫకీరప్ప, ఇరువురి తల్లిదండ్రులకూ కౌన్సెలింగ్ ఇవ్వాలని స్థానిక పోలీసులను ఆదేశించారు. దీంతో తల్లిదండ్రులను పిలిపించిన పోలీసులు, ప్రేమజంటకు ఏం జరిగినా మీదే బాధ్యతంటూ హెచ్చరించి పంపారు.