goshamahal: ఈసారి కూడా గోషామహల్ టికెట్ నాదే: బీజేపీ నేత రాజాసింగ్

  • గోషామహల్ లో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది
  • కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖతమైంది
  • నన్ను ఓడించాలని ఎంఐఎం కుట్ర పన్నుతోంది

ఈసారి కూడా గోషామహల్ టికెట్ తనదేనని బీజేపీ నేత రాజాసింగ్ ఘంటాపథంగా చెప్పారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ, ఈ నియోజకవర్గంలో బీజేపీ తరఫున తాను తప్ప పోటీ చేసే అభ్యర్థి ఎవరు ఉన్నారని ప్రశ్నించారు. కార్యకర్తలకు కూడా పోటీ చేయాలనే ఉద్దేశం ఉంటుందని, అయితే, గెలిచే అభ్యర్థులు ఎవరనే విషయాన్ని అధిష్ఠానం ఆలోచిస్తుందని.. వారికే టికెట్ ఇస్తుందని అన్నారు. గోషామహల్ లో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఉంటుందని.. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖతమైందని అభిప్రాయపడ్డారు.

తనకు చిన్నప్పటి నుంచి ఆవు అంటే ఎంతో ప్రేమ అని, అందుకే, తెలంగాణలో గో సంరక్షణ కరువైందని తాను ఇటీవల రాజీనామా చేశానని, అందుకు, టీ-బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ అంగీకరించని విషయాన్ని ప్రస్తావించారు. వచ్చే ఎన్నికల్లో తనను ఓడించాలని ఎంఐఎం కుట్ర పన్నుతోందని, అందుకే, తన నియోజకవర్గంలో యాభై వేల ఓట్లను తొలగించారని ఆరోపించారు.  

goshamahal
rajasingh
  • Loading...

More Telugu News