నకిలీ 'ప్యారడైజ్' హోటళ్లపై న్యాయస్థానం కొరడా.. వెంటనే బోర్డులు తొలగించాలని ఆదేశం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నకిలీ 'ప్యారడైజ్' హోటళ్లపై న్యాయస్థానం కొరడా.. వెంటనే బోర్డులు తొలగించాలని ఆదేశం!

  • హైదరాబాద్ లో వందలాది నకిలీ ప్యారడైజ్ లు
  • కోర్టును ఆశ్రయించిన ప్యారడైజ్ యాజమాన్యం
  • నకిలీ హోటళ్ల బోర్డులను తొలగించిన అధికారులు
హైదరాబాద్ లోని ప్యారడైజ్ హోటల్ అంటే బిరియానీకి ఫేమస్. కేవలం బిరియానీ కారణంగానే ఆ హోటల్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది. అయితే ఇటీవలి కాలంలో చాలామంది తమ హోటళ్లకు ప్యారడైజ్ అని పేరు పెట్టుకున్నారు. దీంతో నిజమైన ప్యారడైజ్ హోటల్ ఏదో తెలుసుకోలేక భోజన ప్రియులు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో తమ బ్రాండ్ ను పోలిన పేరు పెట్టుకున్న హోటళ్లపై చర్యలు తీసుకోవాలని ప్యారడైజ్ యాజమాన్యం కోర్టును ఆశ్రయించింది.

ఈ హోటళ్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ తమ పేరును చెడగొడుతున్నాయని సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేసింది. వాదనలు విన్న ధర్మాసనం.. ప్యారడైజ్ పేరును మిగతా హోటళ్లు వాడుకోవడం అక్రమమని తీర్పు ఇచ్చింది. వాటిని తక్షణమే తొలగించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు, పోలీసులను ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాలతో పోలీసులు, అధికారులు అక్రమంగా ప్యారడైజ్ పేరుతో ఏర్పాటు చేసిన బోర్డులను తొలగించారు. ప్యారడైజ్ పేరుతో ఉన్న కవర్లు, బాక్సులు, లేబుళ్లను స్వాధీనం చేసుకున్నారు.
Hyderabad
paradise hotels
city civil court
fake hotels

More Telugu News