టాంజానియాలో ఘోర పడవ ప్రమాదం.. 131 మంది జలసమాధి!
- తీరానికి 50 మీటర్ల దూరంలో పడవ మునక
- సామర్థ్యానికి మించి పడవలో ప్రయాణికులు
- ఇప్పటి వరకు 131 మృతదేహాలు వెలికితీత
బుగొలొరా పట్టణంలో జరిగిన సంతకు వెళ్లిన బాధితులు తిరుగు ప్రయాణంలో వస్తుండగా ఈ ఘటన జరిగింది. పడవలో సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, ఇతర సామగ్రి కూడా ఉండడంతో బోటులోని బరువంతా ఒక పక్కకు చేరింది. ఫలితంగా పడవ మునిగిపోయింది. తీరానికి 50 మీటర్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. నిజానికి పడవలో ఎంతమంది ఎక్కారన్న విషయంలో రికార్డులు లేకపోవడంతో గల్లంతు అయిన వారి సంఖ్యపై స్పష్టత లేదు. అయితే, 200 మందికి పైనే ఉన్నారని స్థానిక వార్తా పత్రిక తెలిపింది. కాగా, మృతులకు నివాళిగా టాంజనియా ప్రభుత్వం మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించింది.