బిగ్‌బాస్ హౌస్ వెలుపల బాణసంచాతో కౌశల్ ఆర్మీ సందడి!
- కౌశల్‌కి విపరీతంగా పెరిగిపోయిన సానుభూతి
- హైదరాబాద్, విజయవాడల్లో 2కె వాక్
- కౌశల్ కూతురి పుట్టినరోజు సందర్భంగా హడావుడి
కాగా, నిన్న కౌశల్ కూతురు లల్లీ పుట్టిన రోజు. ఈ సందర్భంగా కౌశల్ ఆర్మీ సభ్యులు ఆయన ఇంటికి వెళ్లి ఆ చిన్నారితో కేక్ కట్ చేయించడమే కాదు... బిగ్‌బాస్ హౌస్ వెలుపల బాణసంచా కాల్చి హడావుడి చేశారు. అర్థరాత్రి 12గంటల నుంచి కొన్ని గంటలపాటు బాణాసంచా కాల్చినట్టు కౌశల్ ఆర్మీ సభ్యులు కొందరు తెలిపారు. కౌశల్ స్నేహితుడు నూతన్ నాయుడు కూడా కౌశల్ ఇంటికి వెళ్లి లల్లీకి బహుమతి ఇచ్చి, విషెస్ చెప్పినప్పటి ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి.