వియత్నాం అధ్యక్షుడు ట్రాన్ డాయ్ క్వాంగ్ కన్నుమూత!
- హనోయ్ లోని సైనిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
- 2016 ఏప్రిల్ 2 నుంచి అధ్యక్షుడిగా ఉన్న క్వాంగ్
- గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అధ్యక్షుడు
క్వాగ్ వయసు 61 సంవత్సరాలు. 2016 ఏప్రిల్ 2 నుంచి ఆయన ఆ దేశానికి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. మాజీ అధ్యక్షుడు తాన్ సాంగ్ ఆయన పేరును ప్రతిపాదించగా... వియత్నాం పార్లమెంటు ఆయనను అధ్యక్షుడిగా ఎన్నుకుంది. అధ్యక్షుడు కాకముందు ఆయన దేశ ప్రజాభద్రత మంత్రిగా పని చేశారు.