'బాహుబలి' వెబ్ సీరీస్ లో శివగామిగా హిందీ నటి మృణాల్‌ ఠాకూర్‌?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'బాహుబలి' వెబ్ సీరీస్ లో శివగామిగా హిందీ నటి మృణాల్‌ ఠాకూర్‌?

  • ‘రైజ్‌ ఆఫ్‌ శివగామి’ పుస్తకం ఆధారంగా వెబ్‌ సీరీస్‌
  • తొమ్మిది ఎపిసోడ్స్‌తో మొదటి భాగం
  • 90 భాషల్లో ఒకేసారి విడుదలకు నిర్మాతల యత్నం
‘రైజ్‌ ఆఫ్‌ శివగామి’ పుస్తకం ఆధారంగా రూపొందిస్తున్న బాహుబలి చిత్రం ‘ప్రీక్వెల్‌’ వెబ్ సీరీస్ లో ప్రధాన పాత్రకు హిందీ నటి మృణాల్‌ ఠాకూర్‌ ఎంపికైనట్లు సమాచారం. హాలీవుడ్‌ను తలదన్నే గ్రాఫిక్స్ ‌తో దర్శకధీరుడు రాజమౌళి సృష్టించిన బాహుబలి ప్రపంచ వ్యాప్త ప్రేక్షకులను ఆకట్టుకుని కలెక్షన్లు, అవార్డుల వర్షం కురిపించిన విషయం తెలిసిందే.

విశేషంగా ఆకట్టుకున్న ఈ తెలుగు జానపద దృశ్యకావ్యంలో ‘శివగామి’ పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీంతో చిత్ర నిర్మాతలు బాహుబలి ‘ప్రీక్వెల్‌’గా ఓ వెబ్‌ సీరిస్‌ను ప్రారంభించారు. ఇందులో కథ మొత్తం రాణి శివగామి చుట్టూనే తిరుగుతుంది. అందువల్ల శివగామి పాత్ర కోసం హిందీ ‘కుంకుం భాగ్య’ సీరియల్‌లో బుల్‌ బుల్‌ పాత్రతో ప్రేక్షకులకు దగ్గరైన మృణాల్‌ ఠాకూర్‌ను ఎంపిక చేశారంటున్నారు.

ప్రస్తుతం మృణాల్ ‘సూపర్‌ 30’లో హృతిక్‌ రోషన్‌తో కలసి నటిస్తోంది. ఇక నెట్‌ ఫ్లిక్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో ఈ సిరిస్‌ను నిర్మిస్తుండగా, రాజమౌళి పర్యవేక్షణలో ప్రవీణ్‌ సత్తారు, దేవా కట్టా ఆయా సీరీస్ కు దర్శకత్వం వహిస్తున్నారు. మొదటి భాగంలో తొమ్మిది ఎపిసోడ్స్ వుంటాయి. 90 భాషల్లో ఒకేసారి విడుదలకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. 
Bahubali
prequel

More Telugu News