సందీప్ డిశ్చార్జ్... మాధవి పరిస్థితి అత్యంత విషమం!

  • నిన్న తండ్రి చేతిలో దాడికి గురైన మాధవి
  • ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స
  • చావుబతుకుల మధ్య పోరాడుతున్న మాధవి
నిన్న హైదరాబాద్ లోని ఎర్రగడ్డ సమీపంలో నడిరోడ్డుపై కన్నతండ్రి చేసిన దాడిలో తీవ్రంగా గాయపడిన మాధవి, చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో ప్రాణాల కోసం పోరాడుతోంది. నిన్నటి దాడి ఘటనలో స్వల్ప గాయాల పాలైన మాధవి భర్త సందీప్ ను డిశ్చార్జ్ చేసినట్టు వైద్యులు తెలిపారు.

మాధవి పరిస్థితి మాత్రం అత్యంత విషమంగా ఉందని, ఆమెకు ఎనిమిది గంటల పాటు సర్జరీ చేశామని, మరో సర్జరీ చేయాల్సి వుందని యశోదా ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. మాధవిని ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉంచి చికిత్స చేస్తున్నామని, మెదడుకు దారితీసే పలు నరాలు తెగిపోవడంతో పరిస్థితి విషమంగా ఉందని తెలిపాయి.
Go Back to Shorts
Madhavi
Sandeep
Hyderabad
Police

More Telugu News