నేను చెప్పింది వేరు.. మీరు అర్థం చేసుకుంది వేరు: రానా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేను చెప్పింది వేరు.. మీరు అర్థం చేసుకుంది వేరు: రానా

  • రానాను ఇంటర్వ్యూ చేసిన జాతీయ ఆంగ్ల పత్రిక
  • 'నాకు బాలీవుడ్ లో ఏదీ ఆసక్తికరంగా లేదు' అని రానా అన్నట్టుగా ప్రచురణ
  • నేను చెప్పింది మీరు సరిగా విన్నట్టు లేదు అన్న రానా
ఓవైపు తెలుగులో వరుస సినిమాలు చేస్తూనే, మరోవైపు బాలీవుడ్ లో కూడా రాణిస్తున్నాడు భల్లాలదేవ రానా. 'బాహుబలి' సినిమాతో నేషనల్ స్టార్ గా మారిన రానా... బాలీవుడ్ లో పలు ఆఫర్లు కొట్టేస్తున్నాడు. ఈ నేపథ్యంలో, ఇటీవల ఓ జాతీయ ఆంగ్ల పత్రిక రానాను ఇంటర్వ్యూ చేసింది. అయితే, ఆ ఇంటర్వ్యూలో తాను చెప్పింది ఒకటైతే... మరొకటి ప్రచురించారని రానా ఆవేదన వ్యక్తం చేశాడు. తాను మాట్లాడిన విషయాన్ని సరిగా వినలేదని చెప్పాడు.

ట్విట్టర్ ద్వారా రానా స్పందిస్తూ, 'నేను చెప్పింది మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను మాట్లాడుతున్నప్పుడు మీరు సరిగా విన్నట్టు లేదు' అని వ్యాఖ్యానించాడు. అసలు విషయంలోకి వెళ్తే... 'నాకు బాలీవుడ్ లో ఏదీ ఆసక్తికరంగా లేదు' అని రానా అన్నట్టుగా సదరు పత్రిక ప్రచురించింది.
rana
bollywood
tollywood

More Telugu News