కొండపల్లి సీతారామయ్య భార్య, కమ్యూనిస్ట్ నేత కోటేశ్వరమ్మ కన్నుమూత!
- అతివాద ఉద్యమంలో కీలకపాత్ర
- పుస్తకాలు, పాటల ద్వారా ఉద్యమానికి ఊపిరి
- నివాళులు అర్పించిన సీఎం చంద్రబాబు
డిశ్చార్జ్ అయినప్పటి నుంచి అస్వస్థతతో బాధపడుతున్న ఆమె ఈ రోజు తుదిశ్వాస విడిచారు. కోటేశ్వరమ్మ చివరి కోరిక మేరకు ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులు విశాఖ కింగ్ జార్జ్ ఆస్పత్రికి అప్పగించనున్నారు. తొలితరం కమ్యూనిస్టు నాయకురాలిగా ఉన్న కోటేశ్వరమ్మ అతివాద ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. ‘నిర్జన వారధి’ అనే పుస్తకాన్ని ఆమె రాశారు. అంతేకాకుండా ఆమె మంచి గాయని కూడా. కాగా, కోటేశ్వరమ్మ మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపం తెలిపారు.