ధోనీ ఈ ఆగ్రహం చూశావా?... డక్కౌట్ కావడంతో ఊగిపోయిన చిన్నారి వీరాభిమాని... వైరల్ అవుతున్న వీడియో!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ధోనీ ఈ ఆగ్రహం చూశావా?... డక్కౌట్ కావడంతో ఊగిపోయిన చిన్నారి వీరాభిమాని... వైరల్ అవుతున్న వీడియో!

  • ఒక్క పరుగు కూడా చేయకుండానే నిష్క్రమించిన ధోనీ
  • పట్టలేని ఆగ్రహంతో ఊగిపోయిన చిన్నారి
  • నవ్వు తెప్పిస్తున్న బాలుడి అసహనం
నిన్న రాత్రి దుబాయ్ లో ఆసియా కప్ లో భాగంగా పసికూన హాంకాంగ్ పై నానా తంటాలు పడి భారత్ గెలిచిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో మహేంద్ర సింగ్ ధోనీ డక్కౌటైన సమయంలో కనిపించిన ఓ దృశ్యం ఇప్పడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. ధోనీ అవుటైన తరువాత ఓ బాలుడు చూపించిన ఆగ్రహం, అసహనం నవ్వు తెప్పిస్తోంది.

శిఖర్ ధావన్ పెవీలియన్ దారిపట్టిన తరువాత బరిలోకి దిగిన ధోనీ, కేవలం మూడు బంతులు మాత్రమే ఆడి ఒక్క పరుగు కూడా చేయకుండానే అవుట్ అయ్యారు. హాంకాంగ్ స్పిన్నర్ ఇషాన్ ఖాన్ బౌలింగ్ లో ధోనీ నిష్క్రమించగా, ఆ బాలుడికి ఎంత ఆగ్రహం వచ్చిందంటే, కుర్చీలను కూడా తన్నాడు. అరుస్తూ గంతులేశాడు. ధావన్ బాదుతున్నప్పుడెల్లా ఆనందంతో గంతులేస్తూ, కనిపించిన ఆ బాలుడు, ధోనీ అవుట్ అయిన తరువాత ఏం చేశాడో మీరూ చూడండి.
Asia Cup
Cricket
MS Dhoni
Out
Fans

More Telugu News