అనిల్ అంబానీ సంచలన నిర్ణయం.. టెలికం సేవలకు గుడ్‌బై!
- పీకలోతు నష్టాల్లో ఆర్ కామ్
- 2000 సంవత్సరంలో ప్రారంభం
- భవిష్యత్తులో రియాల్టీ రంగంలోకి
అతి తక్కువ ధరలకే టెలికం సేవలను అందించాలనే ఉద్దేశంతో 2000 సంవత్సరంలో ఆర్‌కామ్ సేవలను ప్రారంభించినట్టు అనిల్ తెలిపారు. అయితే, ప్రస్తుతం సంస్థ రూ.40 వేల కోట్ల అప్పుల్లో మునిగిపోయిందని పేర్కొన్నారు. కాబట్టి ఈ రంగం నుంచి వైదొలగాలనుకుంటున్నట్టు చెప్పారు. మొబైల్ రంగం నుంచి బయటకు వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారంపై దృష్టి సారించాలని నిర్ణయించినట్టు వివరించారు.