చిరంజీవితో రెండు సినిమాలు చేశాను.. ఆయనకు డబ్బులు కూడా ఇవ్వలేదు!: తమ్మారెడ్డి భరద్వాజ
- 40 ఏళ్ల క్రితం చిరంజీవితో 'మొగుడు కావాలి' సినిమా తీశా
- మనం సినిమా చేయాలని అడగ్గానే చిరంజీవి ఒప్పుకున్నారు
- నేను దర్శకుడిగా మారినప్పుడు పిలవకుండానే వచ్చి, సక్సెస్ పార్టీ ఇచ్చారు
తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ, 40 ఏళ్ల క్రితం చిరంజీవితో 'మొగుడు కావాలి' అనే సినిమా తీశానని చెప్పారు. మా నాన్నగారిపై కోపంతో మనం సినిమా చేయాలని చిరంజీవిని అడిగానని... ఆ సినిమా కథ ఏమిటి? దర్శకుడు ఎవరు? అనే వివరాలు కూడా అడక్కుండానే నటించేందుకు ఆయన అంగీకరించారని తెలిపారు. చిరంజీవితో తనకు ఉన్న అనుబంధం వేరని... ఆయనతో రెండు సినిమాలు చేశానని, వాటికి డబ్బులు కూడా ఇవ్వలేదని చెప్పారు. ఆ తర్వాత సినిమాల పరంగా తాము కలుసుకోలేదని.. కొంత కాలం తర్వాత 'అలజడి' సినిమాతో తాను దర్శకుడిగా మారినప్పుడు... పిలవకుండానే వచ్చి చిరంజీవి సక్సెస్ పార్టీ ఇచ్చారని తెలిపారు.