అలా చైతూతో ఫ్రెండ్షిప్ ఏర్పడింది: సమంత
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అలా చైతూతో ఫ్రెండ్షిప్ ఏర్పడింది: సమంత

  • పాకెట్ మనీ కోసం మోడలింగ్ చేసేదాన్ని
  • అప్పట్లో యాక్టింగ్ రాదు .. తెలుగు రాదు
  • ఫస్టు మూవీ కనుక భయం వుండేది
వెండితెరపై అగ్రకథానాయికగా కొనసాగుతోన్న సమంత, తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ తాను సినిమాల్లోకి ఎలా ఎంట్రీ ఇచ్చింది ప్రస్తావించారు. "చెన్నై కాలేజ్ లో చదువుతూనే పాకెట్ మనీ కోసం నేను మోడలింగ్ చేసే దానిని. పై చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లాలనేది నా డ్రీమ్. అయితే కొన్ని కారణాల వలన ఒక ఏడాది గ్యాప్ వచ్చింది.

ఆ సమయంలోనే నేను సినిమాల్లోకి రావడం జరిగింది. తెలుగులో 'ఏ మాయ చేసావే' సినిమా చేస్తున్నప్పుడే నాగచైతన్యతో ఫ్రెండ్షిప్ ఏర్పడింది. గౌతమ్ మీనన్ గారు పెద్ద దర్శకుడు .. నాకేమో యాక్టింగ్ కొత్త .. తెలుగు రాదు. పైగా పెద్ద పెద్ద డైలాగ్స్ ఉండటంతో నాకు చాలా భయం వేసేది. ఆ సమయంలోనే నాకు చైతూతో మంచి స్నేహం ఏర్పడింది" అని చెప్పుకొచ్చింది. 
chaithu
samanta

More Telugu News