అక్కినేని ఇంటిపేరుగా వచ్చాక బాధ్యత పెరిగింది: సమంత
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అక్కినేని ఇంటిపేరుగా వచ్చాక బాధ్యత పెరిగింది: సమంత

  • సమంతగా నేను ఏమైనా చేయవచ్చు 
  • సమంత అక్కినేనిగా అలా కుదరదు 
  • మా సినిమాల మధ్య పోటీలేదు
తెలుగు ... తమిళభాషల్లో సమంతకి విపరీతమైన క్రేజ్ వుంది. ఈ ఏడాది ఆమె చేసిన సినిమాలు ఆమె క్రేజ్ ను మరింతగా పెంచడం విశేషం. అలాంటి సమంత తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొన్నారు. "అక్కినేని అనే ఇంటిపేరు వచ్చాక మీకు ఎలా అనిపిస్తోంది?" అనే ప్రశ్న సమంతకి ఎదురైంది.

అందుకు సమంత స్పందిస్తూ .. "అక్కినేని అనే ఇంటిపేరు వచ్చాక నాకు బాధ్యత పెరిగింది. సాధారణమైన సమంతగా నేను ఏమైనా చేయవచ్చు .. ఏదైనా మాట్లాడవచ్చు. కానీ అక్కినేని అనే ఇంటిపేరు వలన నేను ఎంతో బాధ్యతగా వుండవలసి వుంది" అని చెప్పుకొచ్చారు. ఇక 'శైలజా రెడ్డి అల్లుడు' .. 'యూటర్న్' సినిమాలు ఒకేసారి విడుదల కావడం గురించి ఆమె స్పందిస్తూ .. "ఈ రెండు సినిమాల మధ్య ఎలాంటి పోటీ లేదు .. రెండు వేరు వేరు జోనర్లు. రెండు సినిమాలు ఒకేసారి థియేటర్స్ కి రావాలని ప్లాన్ చేసింది కాదు .. అనుకోకుండా అలా జరిగిపోయిందంతే" అని చెప్పుకొచ్చారు.  
samanta
ali

More Telugu News