నేడు కూడా వడ్డనే... చుక్కలు చూపుతున్న పెట్రోలు ధర!

  • పెట్రోల్ పై 10 పైసల వడ్డన
  • 9 పైసల మేరకు పెరిగిన డీజిల్ ధర
  • ముంబైలో రూ. 89.54కు పెట్రోలు ధర
వరుసగా పెరుగుతూ వస్తున్న పెట్రోలు, డీజిల్ ధరలు మంగళవారం నాడు కూడా శాంతించలేదు. నేడు లీటరు పెట్రోలుపై 10 పైసలు, డీజిల్ పై 9 పైసల మేరకు ధర పెంచుతున్నట్టు ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది.

దీంతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు రూ. 82.16కు చేరగా, డీజిల్ ధర రూ. 73.87కు పెరిగింది. పెట్రోలు ధరలు అధికంగా ఉండే ముంబై విషయానికి వస్తే, లీటరు పెట్రోలు ధర రూ. 89.54కు, డీజిల్ రూ. 78.42కు చేరాయి. విజయవాడలో రూ. 86.41కి పెట్రోలు ధర, రూ. 79.30కి డీజిల్ ధర పెరిగింది. గుంటూరులో రూ. 86.61కి పెట్రోలు, రూ. 79.50కి డీజిల్ ధరలు చేరుకున్నాయి.  
Go Back to Shorts
Petrol
Diesel
OMCs
Price Hike

More Telugu News